రైతు ఉద్యమానికి ఇంటికొకరిని పంపకపోతే 1,500 ఫైన్.. కట్టకపోతే గ్రామం నుంచి బహిష్కరణ..?

37

ఢిల్లీలో కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా ఉంది. కాగా గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన అల్లర్ల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. బీకేయూ ప్రతినిధి రాకేష్‌ తికాయత్‌ చేసిన ఉద్వేగ ప్రసంగంతో ఉద్యమానికి ప్రజల మద్దతు భారీగా పెరుగుతోంది. వేలాది మంది రైతులు రాత్రికి రాత్రే ఢిల్లీకి పయనమయ్యారు.

ఈ క్రమంలోనే పంజాబ్‌లోని ఓ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమానికి వారం రోజులపాటు కుటుంబంలో ఒకరి చొప్పున కచ్చితంగా పంపాలని బతిండాలోని విర్క్ ఖుర్ద్ గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకుంది. నిరసనకు పంపని వారికి 1,500 రూపాయల జరిమానా విధించనున్నట్లు పంచాయతీ సర్పంచ్ వెల్లడించారు.

జరిమానా చెల్లించనివారిని బహిష్కరిస్తామని విర్క్ ఖుర్ద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మంజిత్ కౌర్ వెల్లడించారు. రైతు ఉద్యమానికి అవమానం జరగకుండా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఉద్యమానికి వెళ్లే గ్రామస్థులు కనీసం వారం రోజులపాటు అక్కడ ఉండాలని ఆమె పేర్కొన్నారు. అక్కడికి వెళ్లిన వారి వాహనానికి ఏదైనా నష్టం జరిగితే గ్రామస్థులు పరిహారం చెల్లిస్తారని ఆమె తెలిపారు.

  • 3
    Shares