నభా నటేష్ కొత్త కారు.. పిచ్చెక్కించే ఫోజులతో ఇస్మార్ట్ హీరోయిన్

7

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ కొట్టిన కన్నడ హీరోయిన్ నభా నటేష్ కొత్త మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసింది. అంతేనా.. కొత్త కొన్న కారుతో హాట్ ఫోజులిస్తూ ఫోటో దిగి షోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పూరీ జగన్నాథ్‌తో నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి, ఆ భారీ విజయం సాధించడంతో నభా నటేష్ డిమాండ్ బాగా పెరిగిపోయింది. కన్నడ చిత్ర సీమ నుంచి వచ్చిన నభా అప్పటి వరకు అరకొర సినిమాలు తీస్తూ వచ్చినా.. ఇస్మార్ట్ శంకర్‌తో ఓ రేంజ్‍కు వెళ్లిపోయింది.

https://i.imgur.com/06NTLx5.jpg
‘వరంగల్‌ కాలేజ్‌లా పోరగాళ్ల చేత ఉచ్చపోయించినా’ అంటూ తన చెప్పే డైలాగ్‌తో తనలో అసలైన కథానాయికను బయటకు తీసింది. నభా చేసిన సీన్లు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇస్మార్ట్ శంకర్ మూవీలో లభించి సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ అయినా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. “పది లక్షల మంది ఇన్‌స్టా ఫాలోయర్లకు కృతజ్ఞతలు.. సెక్సీ కారును నాకు నేనుగా గిఫ్టు ఇచ్చుకున్నాను.. ఈ లైఫ్‍కు ఇంతకన్నా కృతజ్ఞత మరియు గొప్పతనం ఏముంటుంది” అని పోస్టు చేసి ఫ్యాన్స్ మదిని దోచుకుంది.
https://i.imgur.com/iAv44nV.jpg

నటిగా తనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే వరకు సాధారణంగా ఉన్న నభా నటేష్ ఇస్మార్ట్ హిట్టుతో ఖరీదైన లగ్జరీ కారు కొనేసింది. తనకు ఎంతో ఇష్టమైన రెడ్ కలర్‌ కారు మెర్సిడెస్ బెంజ్ కారు కొనుగోలు చేసి, ఆ వెంటనే ఫోటో షూట్ కూడా చేసింది. బ్లాక్ టాప్ అండ్ బ్లూ జీన్స్ నిక్కర్‌లో మత్తిక్కించే ఫోజులతో ఫోటోలు దిగి తన అభిమానులతో పంచుకుంది.

https://i.imgur.com/P6EXmAR.jpg
హీరోయిన్ నభా నటేష్ కెరీర్ విషయానికి వస్తే 19 ఏళ్లకే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నభా.. మొదటి అవకాశంలోనే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సరసన “వజ్రకాయ” చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. కర్ణాటకలో ఈ సినిమా ఎన్నో థియేటర్లలో 100 రోజులకు పైగా ఆడింది. 2018లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమైన నభా నటేష్ నన్ను దోచుకుందువటే మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత రవిబాబు డైరక్షన్‌లో “అదుగో” మూవీలోను నటించింది. పూరీ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్‌లో నభా నటేష్‌ నటించడంతో ఇప్పుడు తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
https://i.imgur.com/nAN6OTb.jpgనభా నటేష్ కొనుగోలు చేసి కారు మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఎ మోడల్. కూపే స్టైల్లో ఉండే లగ్జరీ సెడాన్. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారుగా 32 లక్షల వరకు ఉంది. 2-లీటర్ కెపాసిటీ గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. అయితే నభా ఎంచుకున్న వేరియంట్, స్పెసిఫికేషన్స్ మరియు ప్రైజ్ వంటి వివరాలు తెలియరాలేదు.