
న్యూ ఇయర్ స్టార్టింగ్ లోనే రిలయన్స్ జియో వినియోగదారులకు శుభవార్త చెప్పింది. జనవరి 1, 2021 నుంచి ఇతర నెట్వర్క్లకు కూడా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని జియో తాజాగా ప్రకటించింది.
ట్రాయ్ ఆదేశాల మేరకు ఇంటర్కనెక్ట్ యూసేజ్ ఛార్జ్లకు (ఐయూసీ) 2021, జనవరి 1 నుంచి స్వస్తి పలకనుండటంతో.. మళ్లీ జియో నుంచి ఇతర నెట్వర్క్లకూ ఉచిత కాల్స్ చేసుకోవచ్చని ఆ సంస్థ తాజాగా స్పష్టం చేసింది. ఐయూసీ ఛార్జీలను తొలగించి బిల్ అండ్ కీప్ విధానాన్ని జనవరి 1, 2021 నుంచి అమలు చేయాలని ట్రాయ్ స్పష్టం చేసినట్లు జియో తెలిపింది.
- 1Share