ముగ్గురు హీరోయిన్లతో హార్రర్ థ్రిల్లర్ చేయబోతున్న కాజల్..!

66

కాజల్ అగర్వాల్ తమిళంలో ఓ హార్రర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవలే చెన్నైకు వెళ్లిన కాజల్ కథ విని వెంటనే ఒకే చేసిందట. అంతేకాదు తన పాత్ర కోసం లుక్ టెస్ట్ కూడా చేయించుకుందట. ఆసక్తికర విషయమేంటంటే ఈ చిత్రంలో కాజల్ తో మరో ముగ్గురు హీరోయిన్లు కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నట్టు టాక్‌. మరి మిగిలిన ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరనే దానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది.

గతంలో కవలై వేండమ్ సినిమా చేసిన డైరెక్టర్ డీకయ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. కాజల్ అతి త్వరలోనే చిరంజీవి తో కలిసి ఆచార్య షూటింగ్ లో జాయిన్ కానుంది. ఇక కమల్ హాసన్-శంకర్ ప్రాజెక్టు ఇండియన్ 2 లో కూడా నటిస్తోంది. దుల్హర్ సల్మాన్ తో హే సినామిక చిత్రంతోపాటు బాలీవుడ్ లో ముంబై సాగా చిత్రం చేస్తోంది.

  • 9
    Shares