కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. పలువురికి గాయాలు

36

కరీంనగర్ నుంచి మంచిర్యాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రామగుండం రాజీవ్ రహదారి మల్యాల పల్లి సమీపంలోని ఎన్టీపీసీ రైల్వే బ్రిడ్జి సమీపాన డివైడర్ పై నుంచి పక్కకు దూసుకెళ్లింది. వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా డివైడర్ ఎక్కి పక్కనే రక్షణ గోడ పక్కన నిలిచిపోవడంతో ప్రయాణికులు షాక్ కు  గురయ్యారు.

ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల డిపోకు చెందిన ఈ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైనప్పుడు 30 మందికిపైగానే ప్రయాణికులున్నట్లు సమాచారం.