నటనలో జీవించలేదు… ఏకంగా చంపేసింది..

52

నటనలో ఎక్కువ నైపుణ్యత చూపిస్తే , నటనలో జీవించేసారంటాం.. కానీ కర్ణాటకలో ఒక కళాకారిణి నటనతో చంపేసింది. కర్ణాటక మండ్య జిల్లా నాళవది కృష్ణరాజ కళామందిరం లో కొన్ని రోజుల క్రితం కౌండలిక వధ అనే నాటకం ప్రదర్శించారు. ఈ నాటకం కోసం రామ నగరానికి చెందిన ఇద్దరు కళాకారులతో పాటు బెంగళూరుకు చెందిన దొడ్డ శృతి అంటే కళాకారిణి ఎంపిక అయింది.

నాటకంలో శ్రుతికి ద్రౌపతి పాత్ర ఇచ్చారు. అయితే ఆమె పాత్ర చివరిలో కాళికాదేవి అవతారం ఎత్తి రాక్షసుడు కవుండలిక ను సంహరించే సన్నివేశం ఉంది. ఆ పాత్రలో పూర్తిగా లీనమైన శృతి తోటి కళాకారుడిని త్రిశూలంతో చంపబోయింది. అది గమనించిన సహచరులు ఆమెను పక్కకు లాగేశారు.

తన కుమారుడి ఆరోగ్యం బాగలేదని, ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే అని అందుకే ఈ పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నానని శృతి చెప్పుకొచ్చారు. ఇకనుంచి ఇలాంటి పాత్రలో నటించబోనని చెప్పింది. అయితే ఆమెకు అమ్మవారు నిజంగానే పూనారని అందుకే ఇలా ప్రవర్తించిందని నిర్వాహకులు చెప్పడం కొసమెరుపు.

  • 8
    Shares