పెట్రోల్ పై క్లారిటీ ఇచ్చేసిన కేంద్రం

196

దేశ ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ధరల పోటు తప్పదని తేల్చింది. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి ముడిచమురు, పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం(ఏటీఎఫ్‌), సహజవాయువు(గ్యాస్‌)ను తీసుకొస్తే పన్నుల భారం తగ్గే అవకాశం ఉంటుందని, ధరల నుంచి కాస్త రిలీఫ్ పొందొచ్చని ప్రజలు భావించారు.

అయితే, వీటిని ఇప్పటికిప్పుడు జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం(మార్చి 15,2021) లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు. అంటే, మండిపోతున్న చమురు ధరల నుంచి దేశ ప్రజలకు ఇప్పట్లో ఉపశమనం కలిగే మార్గం లేదన్నమాట.

పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారని, దీంతో ధరలు తగ్గుతాయని అందరూ ఎదురుచూడగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన అందరినీ తీవ్రంగా నిరాశపరిచింది. ప్రభుత్వం విదిస్తున్న సుంకాలు లీటర్ కు చూసుకుంటే పెట్రోల్ పై గత ఏడాది 19.98 రూ. ఉండగా ప్రస్తుతం 32.90 రూ. ఉంది. డీజిల్ పై గత ఏడాది 15.83 రూ. ఉండగా ప్రస్తుతం 31.80 రూ. ఉంది.