కేజీఎఫ్ 2 లో బాలయ్య .. షాక్‌లో ఫాన్స్

61

పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమా ‘కేజీఎఫ్‌ 2’ నటీనటులకు సంబంధించిన ఓ విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘కేజీఎఫ్: ఛాప్టర్‌ 2’ లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారట. గూగుల్‌ సెర్చ్‌లో ‘కేజీఎఫ్‌2’ అని వెతికితే ఆ సినిమాలో నటీనటుల జాబితాలో మన బాలయ్య బాబు పేరును కూడా చూపిస్తోంది. అంతేకాదు.. బాలయ్య పోషించబోయే పాత్ర పేరు ‘ఇనాయత్‌ ఖలీల్‌’ అని కూడా ఖరారు చేసింది. కావాలంటే మీరూ ఒకసారి గూగుల్‌కు వెళ్లి వెతికి ప్రయత్నించండి. ఇనాయత్‌ఖలీల్‌ పాత్ర ఎవరుపోషిస్తున్నారో తెలియాలంటే చిత్రబృందం స్పందించాల్సి ఉంది!

కన్నడ స్టార్‌ యశ్‌, డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో ‘కేజీఎఫ్‌:ఛాప్టర్‌ 2’ తెరకెక్కుతోంది. పాన్‌ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ సినిమా ‘కేజీఎఫ్‌: ఛాప్టర్‌1’ కు కొనసాగింపు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఇందులో ‘అధీర’ పాత్రను పోషిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. సీనియర్‌ నటి రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అలరించనుంది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకొంటోంది.

  • 1
    Share