టీవీ ప్రోగ్రామ్‌లో స్టంట్‌లు కాపీ కొట్టాడు.. మాయ‌మైపోయాడు..

34

కోల్‌కతాలోని విద్యాసాగర్ సేతు బ్రిడ్జి మీద నుంచి ఇద్దరి యువకులు హుగ్లీ నదిలోకి దూకారు. కలర్స్ టీవీలో వచ్చే ‘ఖత్రోం కా ఖిలాడీ’ ప్రోగ్రామ్‌లో చూపించిన ఓ స్టంట్ చేయడం కోసం వీరిద్దరూ నదిలోకి దూకేశారట. దానిని వీడియో కూడా తీశారు. ఆ వీడియోలో కొంతమంది యువకులు వెల్‌కమ్ టూ ఖత్రోం కా ఖిలాడీ అని అరుస్తుండటం.. మరికొందరు ఏమో ‘రాజా గో ఫాస్ట్’ అంటూ యువకులను ఉత్సాహపరిచారు.

ఇక నదిలోకి దూకిన ఇద్దరి యువకుల్లో ఒకరు కనిపించకుండా పోయాడు. ఇక మిస్ అయిన యువకుడి తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కనిపించకుండా పోయిన యువకుడి కోసం ప్రస్తుతం రివర్ పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ గ్రూప్ అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.