ప్రేమికుల దినోత్సవం రోజున… భార్యకు కిడ్నీ దానం చేసిన భర్త

34

రీటాపటేల్‌ (44) మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతోంది. గత మూడేళ్లుగా కేవలం మందులపైనే ఆధారపడి నెట్టుకువస్తోంది. సమస్యత మరింత తీవ్రంగా కావడంతో ఆమె భర్త వినోద్‌ కిడ్నీ ఇచ్చేందుకు ముందుకువచ్చాడు. దీంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు కిడ్నీ మార్పిడికి సరిపోతుందని గుర్తించారు.

ఆటో ఇమ్యూన్‌తో మూత్రపిండాలు సక్రమంగా పనిచేయడం లేదని, గత మూడేళ్లుగా మందులపైనే ఆధారపడుతోందని వైద్యులు డాక్టర్‌ సిద్ధార్థ మావాని తెలిపారు. కిడ్నీ ఇన్ఫెక్షన్‌ శరీరంలో ఆరోగ్యకరమైన భాగాలకు కూడా విస్తరిస్తోందని చెప్పారు. మొదటిసారిగా ప్రేమికుల దినోత్సవం రోజున శస్త్ర చికిత్స నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

తన భార్య పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోయానని, దీంతో కిడ్నీని ఇస్తున్నట్లు చెప్పాడు. మూడేళ్లుగా సమస్యతో బాధపడుతోందని, నెల కిత్రం డయాలసిస్‌ చేయించినట్లు చెప్పారు. తమకు పెళ్లై 23 సంవత్సరాలవుతోందని.. ప్రస్తుతం ఆమెకు 44 సంవత్సరాలని తెలిపాడు.

కష్ట సమయాల్లో తనకు సహకారం అందిస్తున్న జీవిత భాగస్వామి దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నానని రీటాపటేల్‌ తెలిపింది. ‘నేను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నాను. భర్త కిడ్నీ దానం చేయడంతో మేమిద్దరం కలిసి మళ్లీ జీవిస్తామని, ఇది అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. ఈ సందర్భంగా తన భర్తకు కృతజ్ఞతలు తెలిపారు.

  • 20
    Shares