హత్యకేసులో A1 నిందితుడిగా కోడిపుంజు, అరెస్ట్ చేసిన పోలీసులు..

45

జగిత్యాల జిల్లా, వెలగటూరు మండలం, కొండపూర్‌కు చెందిన తనుగుల సతీష్ అనే యువకుడు పందెంకోడి కాలికి అమర్చిన కత్తి గుచ్చుకుని మృతిచెందాడు. తొత్తునూరులో తన స్నేహితులతో కలిసి కోడిపందేలు నిర్వహించాడు. కోడిని పందెంలో దించే సమయంలో కత్తికట్టిన కాలు కాకుండా మరో కాలిని పట్టుకున్నాడు. దాంతో కాలికి అమర్చిన కత్తి సతీష్ పొట్టలో గుచ్చుకుంది.

బాధితుడిని జిగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండడంతో మార్గమధ్యలోనే మృతి చెందాడు. మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు వ్యక్తి మరణానికి కారణమైన కోడిని తీసుకొచ్చి స్టేషన్‌లో కట్టేశారు. కోడి పందేలు ఆడినవారిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే ప్రధానంగా సతీష్ మరణానికి కోడే కారణమని దాన్ని ఏ1 ముద్దాయిగా చేర్చారు. త్వరలో కోర్టులో కోడిని ప్రవేశపెట్టనున్నారు. అప్పటి వరకు కోడిని కంటికిరెప్పలా చూసుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. దానికి తిండి.. నీరు పెడుతున్నారు.