కోపదారి మనిషి దొరికేశాడు.. కొంతమంది ఇంకా గుర్తించట్లేదు..

35

‘చేసే మూడు ఉత్సాహం రెండు సర్వ నాశనం అయిపోతాయి, బేసిక్ సెన్స్ ఉండదండి మనుషుల దగ్గర, తగలబెట్టండి సార్ నిరంజన్ గారు’. ఈ డైలాగులెవరివో ఎవరివో గుర్తుపట్టారా.. అదేనండీ మన కోపదారి మనిషి అలియాస్ యాంగ్రీ న్యూస్ రిపోర్టర్. సోషల్ మీడియా లో ఈయన లేకుండా మీమ్స్  ట్రోల్స్ ఉండవేమో. ఈయన ఎంత ఫేమస్ అంటే హు ఈజ్ కోపదారి మనిషి అంటూ సెర్చ్ కూడా చేశారు చాలామంది.

ఒక ఏడేళ్ళ క్రితం అనుకుంటా సమైక్యాంద్ర ఉద్యమం టైమ్ లో ఈ న్యూస్ రీడర్ కి సంబందించిన ఒక వీడియొ వైరల్ అయింది. న్యూస్ చానల్ లో సభ్యులు సరిగా పని చేయడం లేదని కోపంతో ఊగిపోతాడు. ఆయన కోపమే ఆయన్ని మీమ్స్ స్టార్ ని చేసింది. అక్కడ వీడియొ లో చాలా సీరియస్ గా ఉంటే మనకు మాత్రం నవ్వు ఆగదు. ఆ వీడియో తరవాత మరే చానెల్ లో కూడా ఈయన కనిపించలేదు.

2020 లో కోపదారి మనిషి బేక్ అంటూ ఒక న్యూస్ చానెల్ లో ప్రత్యక్షమయ్యాడు. ఈయన అసలు పేరు కృష్ణ మోహన్. ప్రొఫెషన్ ఒక సీనియర్ జర్నలిస్ట్.  ప్రైమ్ 9 న్యూస్ చానెల్ లో స్ట్రైట్ టాక్ విత్ జర్నలిస్ట్ కృష్ణ మోహన్ అనే ఒక ప్రోగ్రామ్ తో మనముందుకు వచ్చాడు. ఇప్పుడు అమరావతి ఇష్యూ, వైజాగ్ స్టీల్ లాంటి అనేక డిబేట్ లతో అదరగొట్టేస్తున్నాడు ఈ కోపదరి మనిషి.

  • 2
    Shares