కృతి శెట్టి ఒక్క సినిమాతో రూ.6 లక్షల నుంచి రూ.60 లక్షలకు..!

27

తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చేసింది. ఒక రకంగా చెప్పాంటే కృతిశెట్టికి అదృష్టం వెతుక్కుంటు వచ్చిందనాలి. ఎందుకంటే ఉప్పెనలో ముందు అనుకున్న హీరోయిన్ కృతి కాదు. మనీషా రాజ్ అనే మరో ఆమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు. హీరోయిన్ పాత్రలో బాడీ లాంగ్వేజ్ లో ఎందుకో తేడా కన్పించడంతో దర్శకుడు బుచ్చిబాబు కృతిని ఫైనల్ గా సెలక్ట్ చేశాడు.

ఫిబ్రవరి 12వ తేదిన విడుదలైన ఉప్పెన సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. రూ.40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సిని విమర్శకులను సైతం ఆశ్చర్యంకు గురిచేస్తుంది. ఈ సినిమా విడుదల కాకముందు రిలీజైన పాటతో కృతి గురించి ఇండస్ర్డీలో చర్చలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ప్రీరిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి కూడా ఇదే విషయం మాట్లాడుతూ ఒక్కసారి ఉప్పెన విడుదలైతే ఈ అమ్మాయి మీకు దొరకమంటే కూడా దొరకదు ఇప్పుడే హీరోయిన్ గా బుక్ చేసుకోండి అంటూ చెప్పారు.

మెగాస్టార్ అన్నట్లుగానే ఉప్పెన రిలీజ్ తర్వాత కృతి డేట్స్ హాట్ కేక్ లా మారిపోయాయి. చాలా మంది నిర్మాతలు ఇప్పుడు కృతి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. అయితే ఉప్పెన సినిమా కోసం కేవలం రూ.6 లక్షలు మాత్రమే పరితోషకం అందుకున్న కృతి ఈ సినిమా విడుదలకు ముందే నాని శ్యామ్ సింగ రాయ్, సుధీర్ బాబు సినిమాల కోసం రూ.25 లక్షలకు డేట్స్ ఇచ్చింది.

ఇక నుంచి సైన్ చేసే సినిమాలకు మాత్రం రూ.60 లక్షలు డిమాండ్ చేస్తుందంట. కేవలం ఒక్క సినిమాతో కృతి శెట్టి అమాంతంగా రూ.6 లక్షల నుంచి రూ.60 లక్షలకు మారింది. ప్రస్తుతం ఈ భామ వయస్సు 17 ఏళ్లు మాత్రమే. నటనలోనూ రాణించడంతో భారీ పారితోషికం అడుగుతున్నాకూడా దర్శక నిర్మాతలు ఓకే అంటున్నారని కృష్ణానగర్ సమాచారం..

  • 17
    Shares