ఉప్పెన హిట్ అయితే ఇక కృతి శెట్టి ఆగేట్టు లేదుగా..

56

కృతి శెట్టి, వైష్ణవ్ తేజ కలసి నటించిన ఉప్పెన చిత్రం ఫిబ్రవరి 12 న విడుదల కాబోతుంది. ఈ చిత్రంపై విపరీతమైన హైప్ ఉన్న విషయం అందరికీ తెలిసందే. తన మొదటి విడుదలకు ముందే రెండు చిత్రాలకు సంతకం చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది కృతి శెట్టి.

ఆమె ఇప్పటికే నాని (శ్యామ్ సింఘా రాయ్) మరియు సుధీర్ బాబు (దర్శకుడు ఇంద్రగంటి చిత్రం) లతో ఒక్కొక్క చిత్రానికి సంతకం చేసింది. తాజాగా ఇంటర్వ్యూలో తనకు మరో రెండు మంచి ప్రాజెక్టులు ఇప్పటికే వచ్చాయని అయితే ఉప్పెన విడుదలైన తర్వాతే సంతకం చెయ్యనున్నట్టు తెలిపింది.

https://i.imgur.com/l6Grf8V.jpg

ఉప్పేన విడుదలకు ముందే సైన్ చేసిన సినిమాలకు ఈ అమ్మడు 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందట. ఉప్పెన గనుక పెద్ద హిట్‌ అయితే అది మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఉప్పెన విడుదల వరకు కొత్త సినిమాలు సైన్ చెయ్యడం లేదట ఈ అమ్మడు. మొత్తానికి తెలివైందే.

https://i.imgur.com/IuR4n70.jpg

ముంబైలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు ఈ సినిమా కోసం పూర్తిగా తెలుగు నేర్చుకుంది. ఈ సినిమా ఇంటర్వ్యూలలో కూడా తెలుగులోనే మాట్లాడటంతో ఇక్కడి మీడియా ఫ్లాట్ అయిపోయింది. దాదాపుగా దశాబ్దాలు పైగా తెలుగు సినిమాలు చేస్తున్న చాలా మంది హీరోయిన్లకు ఇప్పటికీ తెలుగు రాదు. ఆ విషయంలో ఈ అమ్మడిని మెచ్చుకోవచ్చు.