కలషంలో నవధాన్యాలు పోసి నోట్లో పెట్టి కొట్టి చంపిన తల్లి

52

కనిపెంచిన పిల్లలిద్దరినీ మూఢనమ్మకాలతో తల్లిదండ్రులు చంపిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసులో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ పోలీసులకు దొరికినట్లు సమాచారం. ఆ సీసీటీవీ ఫుటేజీ ద్వారా నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి.

పోలీసుల సమాచారం మేరకు వీడియో ద్వారా అక్కాచెల్లెళ్లిద్దరిలో ఒకరిని తల్లిదండ్రులు కొట్టి చంపలేదని తేలింది. వాకింగ్‌కు వెళ్లిన అక్కాచెల్లెళ్లీద్దరు మంత్రించిన నిమ్మకాయలు తొక్కారని.. అందువల్లే వారికి దెయ్యం పట్టిందని మంత్రగాళ్లను ఇంటికి పిలిపించి పిల్లలకు తాయిత్తులు కట్టించింది వాళ్ళ తల్లి. అలాగే వారి మెడలో రుద్రాక్షలు కూడా వేయించింది. ఆ తర్వాత మాంత్రికుడు ఇంటి చుట్టూ నిమ్మకాయలు కట్టాడు.

అప్పటినుంచి నాలుగు రోజుల పాటు ఇంట్లోనే క్షుద్ర పూజలు నిర్వహించారు. ఆ క్రమంలో ఆదివారం దెయ్యం కనిపించిందంటూ చిన్నమ్మాయి దివ్య కేకలు పెట్టింది. దాంతో అక్క అలేఖ్య డంబెల్ తీసుకొని చెల్లెలు దివ్య తలపై కొట్టి చంపింది. ఆ తర్వాత దివ్య తల్లిదండ్రులు పురుషోత్తం, పద్మజ, అక్క అలేఖ్యలు దివ్య మృతదేహం చుట్టూ నగ్నంగా పూజలు చేశారు. ఆ క్రమంలో చనిపోయిన చెల్లిని బతికించడానికి తన ప్రాణం తీయాలని అలేఖ్య తల్లిని కోరింది.

దాంతో తల్లి పద్మజ ఒక కళశంలో నవధాన్యాలు పోసి.. ఆ కళశాన్ని అలేఖ్య నోట్లో పెట్టి డంబెల్‌తో కొట్టి చంపింది. ఈ ఘటన అంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. అదేవిధంగా ఇంట్లోకి మాంత్రికుల రాకపోకలు కూడా రికార్డయ్యయి. ఈ వీడియో బయటకు రాకుండా పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు.