కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం..

24

హైదరాబాద్ కుషాయిగూడలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో నాలుగు షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. రెండు ఫైర్ఇంజన్ లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే, అగ్నిప్రమాదం పై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరగలేదని, కొందరు ఆకతాయిలు కావాలనే షాపులను నిప్పు పెట్టి ఉంటారని వారు అనుమానిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఫైర్ సిబ్బందికి తెలియపరచడంతో వారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ఒక డిసిఎం, నాలుగు దుకాణాలు దగ్దం అయ్యాయని, షార్ట్ సర్క్యూట్ వల్లనే ఇలా జరిగివుండవచ్చని అధికారుల అంచనా వేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • 3
    Shares