ఆన్ లైన్ లోన్ యాప్ ల ఆటకట్టించిన పోలీసులు

29

ఆన్లైన్ లో లోన్‌లు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న ముఠాలన్నీ చైనాకు సంబంధించినవేనని, ఇప్పటి వరకు మొత్తం 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు నగర సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. ఆరు నెలల నుంచే ఈ యాప్‌ల ద్వారా లోన్‌ల లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. బేగంపేట, పంజాగుట్టలలో 30యాప్‌ల కోసం 600 మంది పని చేస్తున్నట్లు తెలిపారు. డిల్లీలోని ఓ కాల్‌సెంటర్‌లో తనిఖీ చేయగా చైనాకు చెందిన ఓ వ్యక్తి పాస్‌పోర్ట్‌ లభించినట్లు సీపీ తెలిపారు.

ఈ కేసులో పలువురిని అరెస్ట్‌ చేసి రూ.1.52 కోట్లు దాదాపుగా 18 ఖాతాలను స్తంభింపజేశామన్నారు. ఇటీవల రాయదుర్గంలోని ఓ బిల్డింగ్‌లో నిర్వహిస్తున్న ఈ యాప్‌ల నుంచి ఇప్పటి వరకు 1.5 లక్షల మంది లోన్లు తీసుకున్నట్లు గుర్తించారు. కోకాపేటకు చెందిన సీఈఓ శరత్‌చంద్ర, పుష్పలత, వాసవ చైతన్య, సచిన్‌ దేష్‌ముఖ్, వెంకటేష్, సయ్యద్‌ ఆశిక్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు.

‘క్యాష్‌మామా’, ‘దనాధన్‌లోన్‌’, ‘లోన్‌జోన్‌’, ‘క్యాష్‌అప్‌’ ‘మేరాలోన్‌’ ‘క్యాష్‌బస్‌’ ‘క్యాష్‌జోన్‌’ అనే ఏడు రకాల యాప్‌లను సృష్టించిన ప్రధాన నిందితుడు శరత్‌చంద్ర అందులో కొన్నింటిని ఏషియా ఇన్నో నెట్‌వర్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, బ్లూషీల్ట్‌ ఫిన్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు అమ్మేశాడు. మరికొన్నింటికి ఆనియాన్‌ క్రిడిట్‌ కంపెనీ, క్రెడ్‌ ఫాక్స్‌ టెక్నాలజీస్‌కు లింక్‌ చేశాసినట్లు పోలీసులు గుర్తించారు.

  • 1
    Share