చేతి వేలి గోరు పై ఈ గుర్తు ఉంటే ఏమి జరుగుతుంది..

44

చేతి వేలి గోరుపై అర్ధ చంద్రాకారంలో ఉండే షేప్‌ను మీరెప్పుడైనా గ‌మనించారా? చేతి వేళ్ళ గోళ్ళను చూసి మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పవచ్చు అనే విషయం మన అందరికి తెలిసిందే. గోర్ల మీద అనేక రకాల మార్పులను చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు గోర్ల మీద ఉండే అర్ధచంద్ర ఆకారంలో ఉండే షేప్ గురించి వివరంగా తెలుసుకుందాం. చేతి వేలి ప్రారంభంలో నెలవంక ఆకారంలో ఉన్న షేప్ ని ‘లునులా’ (Lunula) అని అంటారు.

ఈ ‘లునులా’ దెబ్బతింటే మొత్తం గోరు దెబ్బతింటుంది. అటువంటి లునులా రంగు ను బట్టి మన ఆరోగ్యం గురించి కొన్ని సంకేతాలను తెలుసుకోవచ్చు. ఒకవేళ లునులా లేకపోతే వారు రక్తహినత,పోషకాహార లోపంతో బాధ పడుతున్నారని అర్ధం. లునులా నీలం రంగు లేదా పాలిపోయినట్టు ఉంటే వారికీ మధుమేహం వచ్చే సూచనలు ఉన్నాయని అర్ధం.

లునులా మీద ఎరుపు రంగు మచ్చలు ఉంటే వారికీ గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అర్ధం. ఇటువంటి వారు ఆలస్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించాలి. లునులా ఆకారం బాగా చిన్నగా ఉండి గుర్తు పట్టటానికి వీలు లేకుండా ఉంటే వారు అజీర్ణంతో బాధ పడుతున్నారని అర్ధం. అంతేకాక వారి శరీరంలో విషాలు పేరుకుపోయాయని అర్ధం చేసుకోవాలి. ఇటువంటి వారు మంచి నీటిని ఎక్కువగా త్రాగాలి.

  • 8
    Shares