సోషల్ మీడియాలో నాపై అసభ్యకర పోస్ట్‌లు పెడుతున్నారు..

31

మాధవీ లత సోషల్ మీడియాలో తనపై వస్తున్న దుష్ప్రచారాలపై సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశారు. ఈమేరకు మాధవీ లత మాట్లాడుతూ మొదటి నుండి నాపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. దేవాలయాల అంశం గురించి మాట్లాడటంతో వేధింపులు ఎక్కువయ్యాయి. వాట్సాప్ లలో కొన్ని గ్రూపులు స్క్రీన్ షాట్ లు చేసి మరి ఫార్వర్డ్ చేస్తున్నారు. అనవసరంగా తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశాను.

పోలీసులు వారిని పట్టుకోకపోతే మౌనదీక్షకు దిగుతాను’ అంటూ మాధవీ లత తెలిపారు. కాగా, మాధవీ లత సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్ట్‌లు పెడుతున్నారని వాపోయారు. సోషల్ మీడియా పోస్టింగ్‌లపై సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై పోరాటం చేస్తున్నామని మాధవీ లత పేర్కొన్నారు.

 

  • 1
    Share