కానిస్టేబుళ్లను తప్పించుకోబోయి ఎస్సై ని ఆసుపత్రిపాలు చేశాడు..

44

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాహనాల తనిఖీ సందర్భంగా అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. అశ్వారావు పేట మండలం ఉట్లపల్లి వద్ద ఎస్సై మధుప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కానిస్టేబుళ్లు రోడ్డుపై వస్తున్న వాహనాలను నిలిపివేస్తుండగా, ఎస్పై మధుప్రసాద్ ఆ వాహనాల తాలూకా లైసెన్స్ లు చెక్ చేస్తున్నారు.

అటుగా బైక్ పై వస్తున్న ఇద్దరు యువకులు కానిస్టేబుళ్లను చూసి భయపడి తప్పించుకునేందుకు ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేశాడు. పక్కనే ఉన్న ఎస్పైని గమనించలేదు. యూటర్న్ తీసుకునే ప్రయత్నంలో నేరుగా ఎస్సైనే ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఎస్సై మధుప్రసాద్ గాయపడడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

  • 4
    Shares