మద్యం మత్తులో తాగుబోతు తల్లి.. పాల కోసం ఎక్కేక్కి ఏడ్చి.. పసిబిడ్డ మృతి..

54

ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తరీ ప్రాంతానికి చెందిన రజ్మీత్ కౌర్, హర్మీత్ భార్యాభర్తలు. వీరికి నెలన్నర పాప ఉంది. హర్మీత్ బైక్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్నాళ్లుగా రజ్మీత్ మాత్రం మద్యానికి బానిసయింది. రాత్రి పగలు తేడా లేకుండా నిత్యం కల్లు, లిక్కర్ తాగుతుండేది. రెండు రోజుల క్రితం రజ్మీత్ భర్త పని మీద బయటకు వెళ్లాడు. రోజూలాగే శుక్రవారం కూడా పీకల దాకా మద్యం తాగి గాఢ నిద్రలోకి జారుకుంది.

అర్ధరాత్రి పాల కోసం పసిపాప ఏడ్చింది. కానీ గాఢ నిద్రలో ఉన్న రజ్మీత్ మేల్కొనలేదు. పాప గుక్కపట్టి ఏడ్చినా కదల్లేదు. పాల కోసం ఏడ్చి ఏడ్చి ఆ బిడ్డ కన్నుమూసింది. ఆ రోజు అంతా పాప ఏడుపు వినబడకుండా సైలెంట్‌గా ఉండడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. ఇంట్లోకి వెళ్లి చూస్తే పాప శవం కనిపించింది. పక్కనే నిద్రపోతూ తల్లి ఉంది. ఆమెను నిద్రలేపేందుకు ఎంతో ప్రయత్నించారు. కానీ మేల్కోలేదు.

చివరకు పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని రజ్మీత్‌ను నిద్రలేపారు. ఆమె నిద్రలేచినా మాట్లాడే పరిస్థితిలో లేదు. అంతగా మద్యం మత్తులో ఉంది. కాసేపటి తర్వాత పాప తండ్రి కూడా ఇంటికి చేరుకున్నాడు. కానీ అతడు మద్యం మత్తులోనే ఉన్నాడు. తల్లి మద్యానికి బానిసై పసిపాపను చంపుకోవడం స్థానికంగా షాక్‌కు గురిచేసింది.

 

  • 21
    Shares