పామును చంపాలని పిలిచింది.. రేప్ చేయబోతే కట్ చేసింది…

36

మధ్యప్రదేశ్​లోని సిద్ధి జిల్లా ఉమారిహా గ్రామంలో దొంగతనంగా ఇంట్లోకి దూరి తనను రేప్ చేయబోయిన వ్యక్తి అంగాన్ని ఓ మహిళ (45) కొడవలితో కోసేసింది. మహిళ వైపు నుంచి చూస్తే గురువారం గ్రామానికి చెందిన మహిళ భర్త పని మీద వేరే ఊరికి వెళ్లాడు. ఇంట్లో తన 13 ఏళ్ల కొడుకుతో పాటు ఆమె మాత్రమే ఉంది. రాత్రి 11 గంటలకు ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడ్డాడు. దొంగోడనుకుని భయపడిన పిల్లాడు బయటకు పారిపోయాడు.

ఆ తర్వాత నిందితుడు మహిళపై రేప్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో మంచం కింద ఉన్న కొడవలిని తీసుకుని ఆమె అతడి సీక్రెట్ పార్ట్ ని కోసేసింది. తర్వాత రాత్రి 1.30 గంటల టైంలో పోలీసు స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ చేసింది. నాలుగు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని హాస్పిటల్ కు తరలించారు.

నిందితుడు రమేష్ సాకేత్ చెప్పినదాని ప్రకారం మహిళ అర్ధరాత్రి పామును చంపాలని ఇంటికి పిలిచింది. అయితే ఆ మహిళ ఆమె కొడుకుతో కలిసి తనను కొట్టి తన ప్రైవేట్ పార్ట్ ని కోసారని అతను పేర్కొన్నాడు. వారి ఇరువురి కుటుంబాల మధ్య పరస్పర వివాదాలు ఉన్నాయని పేర్కొన్నాడు. తనపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేసి, గాయపర్చిందంటూ నిందితుడు కంప్లయింట్ చేయడంతో పోలీసులు బాధితురాలి పైనా కేసు నమోదు చేశారు.

  • 11
    Shares