మహారణా ప్రతాప్ వాడిన కత్తి అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం..

43

ఈమధ్య సోషల్ మీడియా లో ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది. ఒక ఖడ్గం భారతదేశన్నీ పరిపాలించిన మహారణ ప్రతాప్ ది అంటూ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. కానీ ఆ ఖడ్గం ఒక ఇస్లామిక్ హిస్టరీ లోనిది అని తేలింది. ఎమిరేట్ ఆఫ్ గ్రెనడా యొక్క చివరి నస్రిడ్ పాలకుడు బోబ్డిల్ (ముహమ్మద్ XII అని కూడా పిలుస్తారు) కు చెందినది. కత్తి గురించి అదే సమాచారం చారిత్రాత్మకంగా సంబంధిత కత్తులను జాబితా చేసే వెబ్‌సైట్ ‘స్వోర్డ్-సైట్’ లో కూడా చూడవచ్చు.

 ‘ది ఎకనామిక్ టైమ్స్’ ప్రచురించిన ఒక వ్యాసంలో, ‘రాజ్‌పుత్ రాజు మహారాణా ప్రతాప్ రెండు కత్తులు వాడారు వాటి దాదాపు 25 కిలోల బరువు ఉంటుంది. తన శత్రువు నిరాయుధుడైతే పోరాటానికి ముందు ఒక కత్తి తన శత్రువుకు ఇస్తాడని చెబుతారు. ప్రస్తుతం, రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని మహారాణా ప్రతాప్ మ్యూజియంలో ఆ కత్తులు ఉంచారు’.