అందరూ ముఖం చాటేసిన సరే శవాన్ని భుజాలపై మోసిన మహిళా ఎస్ఐ

60

సోమవారం ఉదయం కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం ఉందని అక్కడి ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న శిరీష కు సమాచారం అందింది. ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాటు చేసింది. అయితే స్థానికులు వృద్ధుడి మృతదేహాన్ని మోసేందుకు నిరాకరించారు.

చేసేదిలేక శిరీష స్వయంగా వృద్ధుడి మృతదేహాన్ని స్ట్రేచర్‌పై వేసుకోని మరొకరి సాయంతో శవాన్ని భుజాలపై మోసుకుంటూ కిలోమీటరుకుపైగా పొలం గట్ల మీదుగా రహదారి వరకు మోసుకొచ్చి లలితా చారిటబుల్ ట్రస్ట్‌కు అప్పగించింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఉద్యోగ నిర్వహణలో ఎస్ఐ శిరీష చేసిన పనికి ఉన్నతాధికారులు ఫిదా అయ్యారు. ఆమెకు పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచే కాకుండా ప్రజల నుంచి విశేషంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.