తుప్పల్లో లాక్కెళ్లి భార్యను చంపబోయిన భర్త.! [video]

37

ఖమ్మంలోని టీఎన్జీవోస్ కాలనీ సమీపంలో రోడ్డు పక్కన ముళ్లకంపలో ఓ వ్యక్తి తన భార్యను చంపేందుకు ప్రయత్నించాడు. ఆమెను చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి గొంతునులిమి హత్య చేయబోయాడు. ఇంతలో అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పెద్దగా కేకలు వేశారు. అయినా అతను పట్టువీడకుండా భార్యను అంతమొందించాలని చూశాడు. ఆగ్రహించిన స్థానికులు రాళ్లతో కొట్టి ఆమెను ప్రాణాలతో రక్షించారు.

పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిని చిలకకోయలపాడుకి చెందిన నాగేశ్వరరావు, నవ్య దంపతులుగా గుర్తించారు. తీవ్రగాయాలపాలైన భార్యను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. గత కొంతకాలంగా నాగేశ్వరరావు వేధింపులు తాళలేక భార్య దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

పిల్లలను తీసుకోని ఏన్జీవోస్ కాలనీలో అద్దెకు ఉంటున్న విషయం తెలుసుకున్న భర్త ఆమెను ఎలాగైనా హతమార్చాలని వచ్చాడు. ప్లాన్ ప్రకారమే ఎన్జీవోస్ కాలనీలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి గొంతునులిమి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. స్థానికులు చూడడంతో నవ్య బతికి బయపడింది.