అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విలన్ కు ఐసీయూలో శస్త్ర చికిత్స

19

ఒకప్పుడు విలన్ గా ప్రేక్షకాదరణ పొందిన నటుడు, రాజకీయ మన్సూర్ అలీఖాన్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన స్థానిక అంజిగరైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో చేరారు.

మన్సూర్ అలీఖాన్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆయన కిడ్నీల్లో రాళ్ళు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనకు శస్త్ర చికిత్స చేయనున్నారు.