సముద్రంలో 60 అడుగుల లోతులో వివాహం

33

తమిళనాడుకు చెందిన వధూవరులు వినూత్నంగా మనువాడారు. సముద్రగర్భంలో ఒక్కటయ్యారు. మన దేశంలో ఈ తరహా పెళ్లాడిన జంటగా రికార్డులకెక్కారు. సముద్రజలాల్లో 60 అడుగుల లోతుకు దిగి అక్కడ పెళ్లాడారు. ఇంతవరకు ఈ తరహా మ్యారేజ్‌లు అరుదుగా విదేశాల్లో మాత్రమే చూశాం. మనదేశంలో ఇలా జరగడం ఇదే ప్రథమం కాబోలు.

తమిళనాడులోని తిరువన్నామలైకి చెందిన చిన్నదురై చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్‌గా జాబ్‌ చేస్తున్నాడు. ఇతగాడికి కోయంబత్తూర్‌కు చెందిన శ్వేతతో పెళ్లి నిశ్చయమైంది. సముద్రగర్భంలో పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుందని భావించి పెళ్లి కుమార్తెకు చెప్పాడు. కాబోయే భర్త ఆలోచనకు ఫిదా అయిన శ్వేత వెంటనే ఓకే చెప్పింది. పెద్దలకు విషయం చెప్పి ఒప్పించారు. తర్వాత పాండిచేరికి డీప్‌ సీ స్విమ్మింగ్‌ కోచ్‌ అరవిందను కలిసి తమ కోరిక చెప్పారు.

స్విమ్మింగ్‌ కోచ్‌ పూర్తి భరోసా ఇవ్వడంతో తొలుత ఇద్దరూ స్విమ్మింగ్‌లో శిక్షణ పొందారు. అనుకున్న ముహుర్తానికి చెన్నై సమీపంలోని నీలాంగర్‌ బీచ్‌ సముద్రగర్భంలో చిన్నపాటి పెళ్లి వేదిక సిద్ధమైపోయింది. ఆక్సిజన్‌ సిలిండర్లను తగిలించుకుని కోచ్‌ అరవింద్‌, మరో ముగ్గురు గజ ఈతగాళ్ల సాయంతో పడవలో సముద్రం మధ్యలోకి దిగి ఈతకొడుతూ 60 అడుగుల లోతుకు దిగారు. పూలదండలు మార్చుకున్నాక వధువు మెడలో వరుడు తాళి కట్టాడు. హిందూ సంప్రదాయం జరిగిన ఈ పెళ్లితంతును కొన్ని నిమిషాల్లోనే ముగించుకుని ఒడ్డుకు వచ్చేశారు.

  • 4
    Shares