మ్యాట్రిమొనీలో అందమైన యాంకర్‌ ఫొటో పెట్టి

39

తెలుగు మ్యాట్రిమోని సైట్ లో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి మోసానికి పాల్పడిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బండి లావణ్య అనే యువతిని అరెస్ట్ చేశారు ఎల్బీనగర్ పోలీసులు. లావణ్య నారాయణ స్కూల్ లో ప్రైవేటు టీచర్ గా పని చేస్తున్నట్లు గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. లావాణ్య.. శాన్విహృతిక పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి అబ్బాయిలకు వల వేస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. శాన్వి హృతిక కరొన తో హాస్పిటల్లో చికిత్స పొందుతుందని డబ్బులు కావాలి అంటూ చెప్పి ఓ యువకుడిని మోసం చేసింది.

అలాగే తన కజిన్ హైదరాబాద్ కు వస్తుందని చెప్పి ఆ యువకుడిని కలిసిన లావణ్య షాపింగ్ లకు తిప్పింది. బాధితుడి దగ్గర ఉన్న డబ్బంతా ఖాళీ చేసింది. తర్వాత మోసపోయామని తెలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. నిందితురాలు లావాణ్యను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పో్లీసులు.