అల్లుడు అదుర్స్‌ లో మోనాల్‌ గజ్జర్‌

43

అల్లుడు అదుర్స్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేయబోతోన్నట్లుగా దర్శకనిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఐటెమ్‌ సాంగ్‌ చిత్రీకరణ అన్నపూర్ణ సెవెన్‌ ఏకర్స్‌లో జరుగుతుంది. విషయమేమంటే .. ఈ పాటలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో మోనాల్‌ గజ్జర్‌ ఆడిపాడుతుంది. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన నభా నటేష్‌, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్‌, సోనుసూద్, వెన్నెల కిశోర్‌, సత్యా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం, చోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫర్‌ గా పనిచేస్తున్నారు.