ఇల్లు ఖాళీ చేయిస్తారని తల్లి మృతదేహాన్ని 10 ఏళ్లుగా ఫ్రిజ్‌లో దాచిన కూతురు

41

అంత్యక్రియలు చేయకుండా కన్నతల్లి డెడ్ బాడీని దాచిపెట్టిన విషయం జపాన్ లోని టోక్యో లో వెలుగులోకి వచ్చింది. ఒకటి రెండు కాదు ఏకంగా పదేండ్లు ఫ్రిడ్జ్ లోనే ఉంచింది. తనను ఫ్లాట్ ఖాళీ చేయిస్తారేమోననే భయంతో ఇలా చేసింది. యుమి యోషినో (48) తన తల్లితో కలిసి టోక్యో మున్సిపల్ హౌసింగ్ కాంప్లెక్స్ లోని ఫ్లాట్ లో ఉంటోంది. ఆ ఫ్లాట్ ను యుమి తల్లి లీజుకు తీసుకుంది. అయితే పదేండ్ల క్రితం యుమి తల్లి చనిపోయింది. దీంతో ఆమెను ఫ్లాట్ ఖాళీ చేయిస్తారేమోననే భయంతో తల్లి డెడ్ బాడీని దాచిపెట్టింది.

అప్పటి నుంచి, ఎవరికీ తెలియకుండా ఇంట్లోనే ఫ్రిడ్జ్ లో ఉంచింది.  సరిగా రెంట్ కట్టడం లేదనే కారణంతో ఈ నెలలోనే మున్సిపల్ సిబ్బంది ఆమెను ఫ్లాట్ ఖాళీ చేయించారు. దాన్ని క్లీన్ చేస్తుండగా, డెడ్ బాడీ సంగతి బయటపడింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యుమి ని అరెస్టు చేశారు. యుమి తల్లికి చనిపోయినప్పుడు 60 ఏండ్లు ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. డెడ్ బాడీ మీద ఎలాంటి గాయాలు లేవని పోలీసులు చెప్పారు.

  • 3
    Shares