మొబైల్ చూస్తూ జాతీయగీతం ఆలపించిన MPDO.. మండిపడ్డ నెటిజన్లు

43

సామాన్యులకు జాతీయగీతం రాకపోయిన ఎవరు పట్టించుకోరు. అదే ఓ ఉన్నతాధికారికి జాతీయగీతం రాకపోతే అందరిలో నవ్వులపాలుకాక తప్పదు. మంగళవారం నవ్వులపాలైయ్యే ఘటనే ఒకటి జరిగింది. 72వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జనగామ జిల్లా తరిగొప్పుల మండల కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా అందరు సెల్యూట్ చేసి జాతీయగీతాన్ని ఆలపిస్తున్నారు. ఇంతలో ఎంపీడీఓగా పనిచేస్తున్న ఇంద్రసేన రెడ్డి తన జేబులోంచి ఫోన్ బయటకు తీసి జాతీయ గీతం చూస్తూ పాడారు.

దీనిని ఫోటో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జాతీయగీతం పాడటం రాదా అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. నీ కంటే చిన్న పిల్లలు నయం అని విపరీతంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే సదరు అధికారి ఫోన్ లో జాతీయ గీతం చూసారా? లేదంటే మరేదైనా చూసుకుంటూ జాతీయ గీతం ఆలపించారా? అనేది మాత్రం తెలియరాలేదు. నెటిజన్లు మాత్రం అతడు చూస్తుంది జాతీయగీతమే అని నిర్ధారించారు. ఒకవేళ ఫోన్ లో ఉన్నది జాతీయగీతం కాకపోయినా ఆ సమయంలో ఫోన్ చూడటం తప్పే అంటున్నారు నెటిజన్లు.

  • 22
    Shares