నీళ్ళు త్రాగడానికి ఆలయంలోకి వస్తే దొంగతనానికి అనుకోని చవబాదాడు..

163

ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 14 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న ఒక బాలుడు మంచినీళ్లు తాగడానికి ఘజియాబాద్ రూరల్ పరిధిలోని ఓ ఆలయంలోకి వెళ్లాడు. దీన్ని గుర్తించిన శృంగి నందన్‌ యాదవ్‌ అనే యువకుడు ఆ బాలుడిని పట్టుకుని వివరాలు తెలుసుకున్నాడు.

అతను ముస్లిం కావడంతో ఆలయంలో దొంగతనం చేయడానికి వచ్చావా? అంటూ ప్రశ్నించాడు. నీళ్లు తాగేందుకు వచ్చానని బాలుడు సమాధానం ఇచ్చాడు. దొంగతనానికి వచ్చి ఉంటావంటూ అతణ్ని కొట్టడం వీడియోలో రికార్డయింది. నందన్ యాదవ్ స్నేహితుడు ఈ వీడియోను చిత్రీకరించాడు. ఈ వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్‌గా మారింది.

పోలీసులు స్పందించి నిందితుడితో పాటు వీడియోను చిత్రీకరించిన అతని స్నేహితుడుని అరెస్ట్ చేశారు. నందన్ యాదవ్ బిహార్‌లో భాగల్‌పూర్‌కు చెందిన వాడిగా గుర్తించారు. నిందితుడు మూడు నెలలుగా ఆలయంలోనే నివాసం ఉంటున్నాడని చెప్పారు. నందన్ యాదవ్ నిరుద్యోగి కావడంతో కొంతకాలంగా ఆలయంలోనే నివసిస్తున్నట్లు తెలిపారని చెప్పారు.

  • 5
    Shares