ఒక మహిళ ఇచ్చిన షాక్‌తో లోగో మార్చేసుకున్న మింత్రా..

65

ఈ-కామర్స్ దిగ్గజం మింత్రా లోగో మహిళలను కించపరిచేలా ఉందంటూ ముంబైలో కేసు నమోదైన నేపథ్యంలో ఆ సంస్థ లోగో మార్చే నిర్ణయం తీసుకుంది. అవెస్తా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన నాజ్ పటేల్ గతేడాది డిసెంబరులో ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు మింత్రా లోగో పై ఫిర్యాదు చేశారు.

అది అభ్యంతరకరంగా ఉందని, మహిళలను అవమానపరిచేలా ఉందని ఆరోపించారు. వెంటనే దానిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ స్వచ్ఛంద సంస్థ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు.

పటేల్ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మింత్రా లోగో మహిళలను కించపరిచేలా ఉందని నిర్ధారించి మింత్రా అధికారులకు నోటీసులు పంపారు. నెలలోపే లోగోను మార్చేస్తామని వారు తమకు హామీ ఇచ్చారని ముంబై పోలీస్ సైబర్ క్రైమ్ డీసీపీ రష్మీ కరండికార్ తెలిపారు. కొత్త లోగోను కూడా రివిల్ చేసింది. మింత్రా తన లోగోలో కొన్ని మార్పులు చేసింది.

వెబ్‌సైట్, యాప్‌లో తమ లోగోను మార్చివేస్తున్నట్టు మింత్రా తాజాగా ప్రకటించింది. అలాగే, ప్యాకేజింగ్ మెటీరియల్‌పైనా లోగోను మారుస్తున్నట్టు తెలిపింది. కొత్త లోగోతో ఇప్పటికే ప్యాకేజింగ్ మెటీరియల్‌కు ఆర్డర్ ఇచ్చినట్టు వివరించింది.

  • 7
    Shares