నడిరోడ్డుపై తెలంగాణ హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య (వీడియో)

52

పెద్దపల్లి జిల్లాలో రామగిరి మండలం కలవచర్లలో తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్ దంపతులను దుండగులు అతి కిరాతకంగా నరికేశారు. హైదరాబాద్ నుంచి మంథని వెళ్తుండగా దుండులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కారులోనే కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఈ దాడిలో న్యాయవాదులు వామన్ రావు, భార్య నాగమణి అక్కడికక్కడే మృతి చెందారు.

కొన ప్రాణాలతో ఉన్న వామన్ రావు తనపై కుంట శ్రీనివాస్, అతని అనుచరులు దాడి చేసినట్లు స్థానికులకు వెల్లడించారు. అనంతరం వామన్ రావు కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అలాగే వామన్ రావు స్థానికులకు చెప్పిన విషయాన్ని వాంగ్మూలంగా స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. కాగా, న్యాయవాదులైన వామన్ రావు, నాగమణిల హత్యపై తెలంగాణ న్యాయవాదుల సంఘం స్పందించింది. వీరి హత్యను తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

  • 7
    Shares