నర్సింగ్ యాదవ్ చివరి కోరిక నెరవేరలేదు. నర్సింగ్ భార్య చిత్ర..!

56

ఒకప్పుడు సినిమాల్లో కామెడీ, విలన్ పాత్రల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నర్సింగ్ యాదవ్ 2020 డిసెంబర్ 31వ తేదీన కిడ్నీ సమస్యతో మృతి చెందారు. నర్సింగ్ యాదవ్ సతీమణి చిత్ర తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ నర్సింగ్ యాదవ్ కు సంబంధించిన ఎన్నో కీలక విషయాలను ఆమె మీడియాకు వెల్లడించారు.

ఆమె బీటెక్ లో సీఎస్సీ చదివి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేదాన్నని నర్సింగ్ యాదవ్ తనను మొదటిసారిగా తిరుపతిలో ఒక పెళ్లిలో చూశారని అన్నారు. పెళ్లి చేసుకుంటానని మొదట అడిగినది కూడా ఆయనే, తనతో లైఫ్ బాగుంటుందని నమ్మకంతో తాను అంగీకరించానని చిత్ర చెప్పుకొచ్చారు. 2000 నవంబర్ లో వాళ్ళ లవ్ మ్యారేజ్ జరిగింది అది కూడా పెద్దలు కుదరిచినదే అని చెప్పారు.

తనంటే ఆయనకి పంచ ప్రాణాలని ‘చిత్రా ‘ అంటూ రోజుకు లక్షసార్లు పిలిచేవాడని, ఇలా ప్రతీ చిన్న పనికీ పిలుస్తుండటంతో విసుగొచ్చిన సందర్భాలున్నాయని, ఇక ఎప్పుడూ నీ జపమే చేస్తాడని ఆడపడుచులు ఆటపట్టించేవారని అయితే ఆయన పిలుపులో ప్రేమ వెంటనే అర్థమయ్యేదని ఆమె ఎమోషన్ అయ్యారు.

నర్సింగ్ 300కు పైగా సినిమాలలో నటించారని చిరంజీవి అంటే ఆయనకు ప్రాణం అని, రామ్ గోపాల్ వర్మనీ గురువులా చూస్తారని చెప్పుకొచ్చారు. కిడ్నీ సమస్య వల్ల గత కొన్నేళ్ల నుంచి ఆయన సినిమాలు తగ్గించారని చిత్ర తెలిపారు. నర్సింగ్ యాదవ్ ఇతరులకు సహాయం చేసే మనస్త్వత్వమని ఆకలి అని అనేవారికి అన్నం పెట్టేవారని చిత్ర తెలిపారు.

కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న సమయంలో మంచంపై పడకుండా సినిమాల్లో నటించాలని నర్సింగ్ చెప్పేవారని కానీ చివరి కోరిక తీరకుండానే ఆయన చనిపోయారని చిత్ర ఎమోషన్ అయ్యారు. కొడుకు రుత్విక్ యాదవ్ బీటెక్ చదువుతున్నాడని రుత్విక్ కు సినిమాలపై అస్సలు ఆసక్తి లేదని నర్సింగ్ కు మాత్రం కొడుకును సినిమాల్లో చూడాలని అనుకునే వారని ఆమె తెలిపారు.

 

  • 9
    Shares