లేడీ జడ్జి కి చాలా అందంగా ఉన్నారంటూ ప్రపోజ్ చేసిన నిందితుడు.. ఆ తర్వాత..

60

అమెరికాలోని ఫ్లోరిడాలో డెమెట్రియస్ లూయిస్ అనే వ్యక్తి ఇటీవల ఓ దొంగతనం కేసులో పోలీసులకు దొరికాడు. అతడిని అధికారులు కోవిడ్ కారణంగా జూమ్ కాల్ ద్వారా తబితా బ్లాక్‌మాన్ అనే మహిళా జడ్జి ముందు హాజరుపరిచారు.

జడ్జి నిందితుడి శిక్షకు సంబంధించిన పత్రాన్ని చదువుతుండగా లూయిస్ ఒక్కసారిగా ‘మీరు చాలా అందంగా ఉన్నారు. మీతో ఈ మాట చెప్పేతీరాలి. ఐ లవ్ యూ..’ అని అన్నాడు. దీంతో ఆ వీడియో కాల్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అయితే లూయిస్ ప్రపోజల్ విన్న లేడీ జడ్జి ‘పొగడ్తలు నీకు ఎక్కడైనా ఉపయోగపడచ్చు కానీ ఇక్కడ మాత్రం పనిచేయవు’ అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గామారింది.