నిధి అగర్వాల్ కి గుడి కట్టి పూజలు, పాలభిషేకాలు చేస్తున్న ఫాన్స్

47

తెలుగు లో అంతగా కాకపోయినా తమిళంలో మాత్రం ఇప్పటికే స్టార్ హీరోయిన్ అయిపోయింది నిధి అగర్వాల్. అక్కడ ఈ భామకి పిచ్చెక్కిపోయే అభిమానులు ఉన్నారు. ఈమెకు అక్కడ ఏకంగా గుడి కట్టేసారు. తెలుగు, తమిళ అభిమానులు కలిసి నిధి అగర్వాల్‌కు చెన్నై లో గుడి కట్టారు.

https://i.imgur.com/bHR4VOU.jpg

అంతేకాదు అక్కడ పూజలు కూడా చేస్తున్నారు. దేవత ముందు దీపం వెలిగించినట్లు ఈమె ముందు కూడా పూజలు చేస్తున్నారు. పాలాభిషేకాలు చేస్తున్నారు. అవన్నీ చూసి ఆమె తనకు గుడి కట్టడం ఏంటి అని ఒక రకమైన షాక్‌లోకి వెళ్లిపోయింది.

https://i.imgur.com/uCyBJvz.jpg

ఇంత ప్రేమకు తానేం సమాధానం చెప్పాలి. ఎలా కృతజ్ఞతలు చెప్పాలి అంటుంది నిధి అగర్వాల్. ఈమె కంటే ముందు మరికొందరు హీరోయిన్లకు కూడా గుడి కట్టారు అభిమానులు. గతంలో బొద్దుగుమ్మలు ఖుష్బూ, నమిత, నయనతారకు కూడా గుడి కట్టి తమ అభిమానం చాటుకున్నారు తమిళ అభిమానులు.

https://i.imgur.com/gzOpfzv.jpg

  • 7
    Shares