వాహనదారులకు చెక్.. ముందు కొన్న వెహికిల్స్ అన్నీ తుక్కు కిందకే..

36

15 ఏళ్లు దాటిన టూ వీలర్స్‌, కమర్షియల్ వాహనాలను స్క్రాప్‌గా మార్చేందుకు కొత్త విధానం తీసుకొస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వాహనాల కాలపరిమితి ముగిస్తే… వాటిని తుక్కుగా మార్చేయాలని ప్రభుత్వం తెలిపింది. పాత వాహనాలను స్క్రాప్‌గా విక్రయిస్తే… కొత్త వాటిని కొనుగోలు చేసేటపుడు రాయితీలు ఇవ్వనుంది. త్వరలోనే వెహికల్ స్క్రాపేజీ పాలసీని తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

స్వచ్ఛంద వాహన తుక్కు విధానంతో వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, వాణిజ్య వాహనాలకు 15 ఏళ్లు జీవితకాలం గా నిర్ణయించారు. 15 రోజుల్లో కొత్త విధానాన్ని ప్రకటించనుంది కేంద్రం. కాలం చెల్లిన వాహనాల స్క్రాప్‌ వెళ్లడం ద్వారా… కొత్త వాహనాలకు డిమాండ్‌ పెరగనుంది. ట్యాక్స్‌ల రూపంలో కేంద్రానికి ఆదాయం సమకూరనుంది. కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రొత్సహించనుంది.

వాహనాన్ని తుక్కు చేసినట్లు సర్టిఫికెట్‌ చూపిస్తే… కొత్తగా కొనుగోలు చేసే వాటికి ట్యాక్స్‌ల రూపంలో రాయితీ ఇస్తారట. కేంద్రం కూడా ఒక శాతం రాయితీ ఇవ్వనుంది. రోడ్‌‌ ట్యాక్స్‌‌, రిజిస్ట్రేషన్‌‌ ఫీజు మినహాయింపు ఇచ్చే చాన్స్ ఉంది. ఇందుకోసం రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. కొత్త పాలసీ వస్తే ఈ పాత వెహికల్స్ అన్నీ స్క్రాప్‌కు వేయాల్సి ఉంటుంది.

  • 4
    Shares