ఉల్లిగడ్డపై నల్లని పొర వల్ల బ్లాక్​ ఫంగస్​ వస్తుందా…? క్లారిటీ ఇచ్చేశారు..

17

క‌రోనా నుండి కోలుకున్న వారిని కొంతమందిని బ్లాక్ ఫంగ‌స్ వెంటాడుతున్న విష‌యం తెలిసిందే. తొలుత బ్లాక్ ఫంగస్, ఆ త‌ర్వాత వైట్, ఇప్పుడు తాజాగా ఎల్లో ఫంగ‌స్. ఇమ్యూనిటి ప‌వ‌ర్ త‌క్కువ‌గా ఉండ‌టం, స్టెరాయిడ్స్ అధికంగా వాడటం వ‌ల్ల ఈ ఫంగ‌స్‌ల ప్ర‌మాదం అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయినా కానీ.. పలు వార్తలు బాధితులను ఆందోళనలో పడేస్తున్నాయి.

నల్లగా ఉండే ఉల్లిగడ్డల ద్వారా బ్లాక్​ఫంగస్​ వస్తోందని ఈ మధ్య సోషల్ మీడియా లో ఓ వార్త వైరల్ అయింది. దీంతో పాటు ఫ్రిజ్​లో నల్లగా పేరుకుపోయిన ఫంగస్​ వల్ల కూడా సోకే అవకాశముందని వాట్సాప్ లో మెస్సేజ్​లు స‌ర్కులేట్ అవుతున్నాయి. ఈ వార్తలపై స్పందించి ఎయిమ్స్​ చీఫ్​ రణ్​దీప్​ గులేరియా.. ఓ స్పష్టతనిచ్చారు. ఉల్లిగడ్డల ద్వారా బ్లాక్​ఫంగస్​ వస్తుందన్న వార్తలు పూర్తిగా అసత్యం అని కొట్టిపారేశారు.

రిఫ్రిజిరేటర్‌లో నల్లగా పేరుకుపోయిన బ్యాక్టీరియా కూడా బ్లాక్​ ఫంగస్​కు కారణమవుతుందనేది అవాస్తమ‌ని చెప్పారు. ప్రజలు ఇటువంటి ఫేక్​న్యూస్ నమ్మి భయపడొద్దని సూచించారు. కూరగాయలు, వస్తువుల ద్వారా బ్లాక్ ​ఫంగస్​ రాదని వెల్ల‌డించారు. ఉల్లిగడ్డలపై కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్​ వల్ల వస్తుందని, దాన్ని శుభ్రం చేసుకుని వాడుకుంటే ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు.