చికెన్ బిర్యానీలో పురుగులు… హైదరాబాద్ టాప్ రెస్టారెంట్ సీజ్

374

బిర్యానీ తినేందుకు మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మేడిపల్లిలోని ప్యారడైజ్ అనే రెస్టారెంట్‌కు ఓ కస్టమర్ వచ్చాడు. అతను ఆర్డర్ చేసిన బిర్యానీలో పురుగులు వచ్చాయని ఆరోపించాడు. మరో ఆర్డర్ డబల్ కా మీఠా స్వీట్ ఆర్డర్ చేయగా.. అందులోనూ పురుగులు కనిపించాయని అతను ఆరోపించాడు.

దీంతో ఆయన మున్సిపల్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయగా స్పందించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు శానిటేషన్ సిబ్బందితో కలిసి హోటల్‌‌లో తనిఖీ చేశారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు చికెన్, మటన్ కుళ్లిపోయి ఉండడాన్ని గమనించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకొని హోటల్‌ను సీజ్ చేసి రూ.50 వేల జరిమానా కూడా విధించారు.

  • 16
    Shares