చనిపోయిన వ్యక్తికి పింఛన్ ఇచ్చి చిక్కుల్లో పడిన వాలంటీర్..

44

విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని గుర్ల గ్రామంలో ఎర్ర నారాయణమ్మ అనే వృద్ధురాలు సోమవారం ఉదయం మరణించారు. 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్ల ద్వారా నేరుగా ఇంటి వద్దే వృద్ధులకు పెన్షన్ అందజేస్తుంది. వాలెంటీర్ గా పనిచేస్తున్న ఇజ్జిరోతు త్రినాథ్ పింఛను పంపిణీ చేసేందుకు ఎర్ర నారాయణ ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆమె మరణించగా మృతదేహాన్ని ఇంటి బయట ఉంచి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎర్ర నారాయణమ్మ చనిపోయినప్పటికీ అప్పటికే ఆమెకు పింఛను మంజూరైంది కాబట్టి ఇవ్వడం తన విధి అని ఆమెతో వేలి ముద్ర వేయిస్తే చాలని కుటుంబ సభ్యలతో చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు కూడా సరేనని ఆమె వేలిని బయోమెట్రిక్ పరికరంపై ఉంచి వేలి ముద్రలు వేయించారు. చనిపోయిన వృద్ధురాలికి పింఛన్ ఇస్తున్నట్లు, వేలి ముద్రలు తీసుకుంటున్నట్లుగా ఉన్న ఫోటో సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది. నిజానికిచనిపోయిన వారికి పెన్షన్, ఇతర పథకాలు ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవు.

ఈ నేపధ్యంలో చనిపోయిన వ్యక్తికి పెన్షన్ పంపిణీ చేశారనే విషయం తెలుసుకున్న అధికారులు సమాచారం సేకరించారు. ఈ ఘటనలో ఎంపీడీవో కళ్యాణిని విచారణా అధికారిగా నియమించగా ఆమె మాట్లాడుతూ ఎర్ర నారాయణమ్మ చనిపోక ముందే పింఛను అందజేశారని వాలంటీర్ ఎవిడెన్స్ కోసం ఫోటో తీసుకున్నారని తెలియజేశారు.

  • 11
    Shares