పొలంలో బట్టలు లేకుండా పడి ఉన్న మహిళ, ఆస్పత్రికి తీసుకెళ్తే..

55

కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని తునికిపాడులో ముచ్చింతల రజిని (34) అనే వివాహితను పొలంలో వివస్త్రను చేసి దారుణంగా హతమార్చారు. తునికిపాడు సమీపంలోని ఒక పంట పొలంలో రజిని స్పృహ కోల్పోయి వివస్త్రగా ఉన్నట్లు ఆమె అత్తింటి వారికి సమాచారం అందింది. కుటుంబ సభ్యులు వెంటనే అక్కడకు చేరుకుని ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే ఆమె మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో రజిని మృతదేహానికి శవ పరీక్ష చేసి, సోమవారం రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. అయితే తన భార్య రజినిని గజ్జల నరసయ్య అనే వ్యక్తి హతమార్చినట్లుగా ఆమె భర్త రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

రజిని మృతదేహాన్ని సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తునికిపాడు తీసుకొచ్చిన బంధువులు గజ్జల నరసయ్య ఇంటి వద్ద ఉంచి ఆందోళన చేశారు. నిందితుడిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని, అప్పట్లో ఆ కేసులో నిందితులకు విధించిన సత్వర శిక్షను నరసయ్యతో పాటు హత్యలో ప్రమేయం ఉన్న వ్యక్తులకు విధించాలని డిమాండ్‌ చేశారు.