షటిల్ ఆడుతూ కుప్పకూలిన సీఐ..

40

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భగవాన్ ప్రసాద్ పశ్చిమగోదావరి జిల్లా గణవరంలో సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే గణవపరం పోలీస్ స్టేషన్ సమీపంలో షటిల్ ఆడేందుకు వెళ్లారు. ఆట మధ్యలోనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. సీఐను వెంటనే గణపవరంలో ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే భగవాన్ చనిపోయినట్లు స్థానిక వైద్యులు నిర్ధారించారు. భగవాన్ గుండెపోటుతో చనిపోయారని అనుమానిస్తున్నారు. సీఐ షటిల్ ఆడుతూ కుప్పకూలడం సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. ఇందుకు సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.