ట్రాఫిక్ రూల్స్ మాకేనా.. మీకు వర్తించవా?.. పోలీసులను ప్రశ్నించిన యువకుడు..

36

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో హెల్మెట్‌ పెట్టుకోని వారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. అయితే బైక్స్‌పై వచ్చిన పోలీసులకు హెల్మెట్ లేని విషయం గమనించిన ఓ యువకుడు తన మొబైల్‌లో వీడియో తీయడం ప్రారంభించాడు. హెల్మెట్ ధరించని పోలీసుతో పాటు, అతను నడుపుతున్న బైక్‌ను కూడా వీడియో తీశాడు.

మీరే నిబంధనలు పాటించనప్పుడు.. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ఎలా జరిమానాలు విధిస్తారని పోలీసులను ప్రశ్నించారు. హెల్మెట్ లేకుండా బండి ఎందుకు బయటకు తీసుకొచ్చారని వారితో వాదనుకు దిగాడు. జనాలు హెల్మెట్ లేకుండా బండి నడిపితే ఫొటోలు తీసే మీరు దీనికి ఏం సమాధానం చెబుతారని అడిగాడు.