కుళ్లిపోయిన శవాన్ని 3 కిలోమీటర్లు మోసిన పోలీసులు..

32
విశాఖపట్నం జిల్లా  రాంబిల్లి మండలంలోని, సీతపాలెం సముద్ర తీరానికి కొట్టుకు వచ్చినటు వంటి ఒక మృతదేహాన్ని రివెన్యూ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు దాని పై కేసు నమోదు చేసి, చుట్టుపక్కల గ్రామాలకు మండల పోలీసువారికి సమాచారం అందించారు.
చుట్టుపక్కల ఎవరూ గుర్తించకపోవడంతో అనాధ శవం గా పరిగణించారు. మారుమూల ప్రాంతం మరియు సుమారు మూడు రోజులు అవ్వడం వల్ల మృతదేహం కుళ్ళి పోయి దుర్వాసన రావడంతో సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. చేసేదిలేక పోలీసులే మృతదేహాన్ని 3 కిలోమీటర్ల సముద్రతీరం వెంబడి మోసుకొచ్చి ఎలమంచిలి మార్చురీలో ఉంచారు.
ఇందులో రాంబిల్లి ఎస్ ఐ అరుణ్ కిరణ్ మరియు అతని సిబ్బంది ASI దొర, హెడ్ కానిస్టేబుల్ మసేను, కానిస్టేబుల్ నర్సింగరావు మరియు హోంగార్డ్ కొండబాబు పాల్గొన్నారు. వీరు మానవత్వం తో చేసిన సేవలను అందరూ అభినందించారు.

  • 16
    Shares