హైదరాబాద్ రోడ్లపై లంబోర్ఘిని వేసుకు తిరుగుతున్న ప్రభాస్..?

31
prabhas new car

రెబల్ స్టార్ ప్రభాస్ లంబోర్ఘిని అవెంటడార్ రోడ్‌స్టర్ బాహుబలి కారును తన సొంతం చేసుకున్నారు. ఓవర్‌హెడ్ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే భారతదేశంలో కారు ధర రూ. 5.6 కోట్లుగా ఉంది. మొత్తంగా ఇది ఆరు కోట్లకు పైగా ఖర్చుతో ఇంటికి చేరుతుంది. లంబోర్ఘిని భారత్‌లో అత్యంత విలువైన కార్లలో ఒకటి. ప్రస్తుతం ఈ కారు భారతదేశంలో ట్రెండింగ్‌లో ఉంది.

చూడడానికి ప్రకాశవంతమైన నారింజ రంగులో స్పోర్ట్స్ కారు లుక్‌లో ప్రేమికులను ఆకట్టుకుంటుంది. లంబోర్ఘిని అవెంటడార్ రోడ్‌స్టర్ బెంగళూరులోని లంబోర్ఘిని షోరూమ్‌ నుంచి హైదరాబాద్‌లోని ప్రభాస్‌ ఇంటికి ఇటీవలే కారును డెలివరీ చేయగా.. ఆల్రెడీ కారుతో హైదరాబాద్‌ రోడ్లు మీద ప్రభాస్ చక్కర్లు కొట్టినట్లుగా తెలుస్తోంది.

అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రభాస్ ఈ కారుపై కవర్‌ను తీస్తుండగా.. అందుకు సంబంధించిన వీడియోను అభిమానులు షేర్ చేసుకుంటున్నారు.

Prabhas New Car