చిరు వ్యాపారికి ట్రాఫిక్ పోలీస్ వారి రూ.1.13 లక్షల జరిమానా

44

హెల్మెట్ లేకుండా బైకు నడిపిన చిరు వ్యాపారికి RTO అధికారులు 1.13 లక్షల రూపాయల జరిమానా విధించి షాక్ ఇచ్చారు. మినీ వేన్ అనుకునేంతగా బైకు మొత్తం ప్లాస్టిక్ డ్రమ్ములతో కప్పేసి తీసుకుని వెళ్తున్న ప్రకాష్ అనే ఒక చిన్న వ్యాపారిని అధికారులు పట్టుకున్నారు. ఈ తనిఖీలో వాహనానికి రిజిస్ట్రేషన్‌ చేయించలేదని, ఏ విధమైన పత్రాలు కూడా లేవని గుర్తించారు.

అయితే రిజిస్ట్రెషన్‌ లేకుండా వాహనం ఉపయోగించినందుకు అతనికి రూ. 5వేలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేనందుకు రూ.5 వేలు, వాహనానికి ఇన్స్‌రెన్స్‌ లేనందుకు రూ.2 వేలు, హెల్మెట్‌ ధరించనందుకు రూ.1000, అలాగే CH-VII 182-A1 ను ఉల్లంఘించినందుకు రూ. లక్ష చొప్పున మొత్తం రూ.1.13 లక్షల జరిమానా విధించారు.

అమ్మో అంత ఫైనా.. అంటూ కొద్దిసేపు బతిమాలి.. బేరమాడినట్లే కనిపించిన ప్రకాష్ బంజారా.. వెంటనే స్నేహితులకు చకచకా ఫోన్లు చేసి.. డబ్బులు తెప్పించుకుని ఫైన్ కట్టి వెళ్లిపోయాడు. కొందరు ఇతని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కాసేపట్లోనే వైరల్ అయ్యాయి.

  • 6
    Shares