పుష్ప నుంచి రెండు సీన్లు లీక్.. షాక్ లో బన్నీ, సుకుమార్

41

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప’కు లీకుల బేడద తప్పలేదు. ఈ సినిమా నుంచి తాజాగా రెండు సన్నివేశాలు లీకయ్యాయి. అందులో ఒకటి బన్నీ, రష్మికల మధ్య వచ్చే మెలోడీ సాంగ్‌, మరొకటి పోలీసులకు, అల్లు అర్జున్‌లకు మధ్య జరిగే ఫైట్‌ సీన్‌. ఈ రెండు సీన్లకు సంబంధించిన క్లిప్పింగులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇలా ఒకేసారి రెండు సీన్లు లీక్ అవ్వడం యూనిట్ కు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. కాగా, పుష్ప సినిమాను ఔట్ డోర్ లో షూట్ చేస్తున్నారు. షూటింగ్ కోసం వచ్చిన జనాల్లో ఎవరో ఒకరు తమ మొబైల్ కు వీడియో తీసి వైరల్‌ చేసినట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

  • 4
    Shares