విగ్రహం విధ్వంసం కేసులో ఆ గుడి పూజారే దోషి.. డబ్బుకు కక్కుర్తి పడి..

43

జనవరి 1న ఉదయం 8 గంటల సమయంలో రాజమండ్రి శ్రీరామనగర్‌లో ఉన్న శ్రీ సంకరటహర వరసిద్ధి వినాయక స్వామి గుడి లోని పూజారి మరల వెంకట మురళీ కృష్ణ (45) జనవరి 3న పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 31న రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో ఉన్న శ్రీ సుభ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం రెండు చేతులు ధ్వంసం చేసినట్లుగా ఫిర్యాదు చేయగా, పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దేవుడి విగ్రహం ధ్వంసమైనట్లు ఫిర్యాదు చేసిన పూజారినే ముద్దాయిగా పోలీసులు గుర్తించారు. దీంతో నిందితుడిని ఈ నెల 31న అరెస్టు చేశారు. విచారణలో పూజారి వెంకట మురళి కృష్ణ సుభ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాన్ని తానే ధ్వంసం చేసి పోలీసులను తప్పు దోవపట్టించడానికే ఫిర్యాదు చేసినట్లుగా నేరం అంగీకరించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు రూ. 30 వేలు డబ్బుకు ఆశపడే ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు ప్రకటించారు.

దర్యాప్తు ఇప్పటి వరకు లభించిన ఆధారాల మేరకు, వెంకట మురళితో పాటు మల్ల వెంకటరాజు (42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ భర్త), దంతులూరి వెంకటపతి రాజు (మాజీ టీఎన్టీయూసీ ఆర్గరైజింగ్ సెక్రటరీ)ని అరెస్టు చేసినట్లు వివరించారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ వెల్లడించారు.