వ్యాక్సిన్ తీసుకున్న రమ్యకృష్ణ..

35

సీనియర్ నటి రమ్యకృష్ణ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో, ఇంస్టాగ్రామ్ లలో పోస్ట్ చేశారు. “మన కోసం, ఇతరుల కోసం.. వ్యాక్సిన్ తప్పనిసరి” ఆమె ట్యాగ్‌లైన్ పెట్టారు.

ఆమె ఫోస్టుకు నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్స్ పెడుతున్నారు. ‘మేడమ్ మీరు వ్యాక్సిన్ తీసుకుంటుండగా కూడా ఎంత అందంగా ఉన్నారు’ అని ఒకరు కామెంట్ చేయగా ‘ఆ మాస్క్ పెడితే కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయ్. ఆ చూపులు మా హృదయాలను గాయపరుస్తున్నాయ్’ అని మరొకరు కామెంట్ పెట్టారు.

ప్రస్తుతం ఆమె భర్త, టాలీవుడ్ క్రీయేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. నాగార్జున సరసన ‘బంగార్రాజు’ సినిమాలో కూడా నటించనుంది.

  • 13
    Shares